గండ్రత్ సుజాతను కలిసిన మేకల జితేందర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌గా నియమితులైన మేకల జితేందర్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జితేందర్ ను శాలువాతో గండ్రత్ సుజాత సన్మానించారు. పార్టీ బలోపేతానికి, అప్పగించిన బాధ్యతలకు కట్టుబడి పనిచేస్తానని జితేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మల్లయ్య , పోచన్న, రూరల్ మండల అధ్యక్షులు వెంకటి యాదవ్, తుడం వినోద్, చౌదరి వినోద్, కార్తీక్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జితేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.