పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెన్ గంగా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన కన్నె పవన్ కుమార్ అనే యువకుడు శనివారం పెన్ గంగా నదిలో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం నదిలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు నదిలో గల్లంతయిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం నుండి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు...