గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వీబీ జీరాంజీ పథకం నిధులు రూ:20 లక్షలతో సాత్నాల మండలం దౌన, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కోసం ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సైద్పూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ చేలకు వెళ్లడానికి పొలంబాట చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీబీ జీరాంజీ పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడుతుందని, ఈ పథకాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో రైతులు పండించిన పంటను నిల్వ చేయడానికి చిన్న గోదాంలను నిర్మించుకోవడానికి అవకాశం వచ్చిందన్నారు. ఆయన వెంట నాయకులు ఎల్టి అశోక్ రెడ్డి, అస్తక్ సుభాష్, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.