ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయండి: PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్
చిత్రం న్యూస్, జైనథ్: సెప్టెంబర్ 1న హైదరాబాదులో నిర్వహించే ఉపాధ్యాయుల ధర్నాకు పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని PRTUTS జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహ స్వామి అన్నారు. PRTUTS జైనథ్ మండల శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక ప్రాథమిక పాఠశాల జైనథ్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు PRC వెంటనే ప్రకటించాలన్నారు. 2026-28 సంవత్సరపు నూతన కార్యవర్గాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిలుకూరి బాపురావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా M. ఇస్తారి, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా సుజాత, ఉపాధ్యక్షులుగా అనిల్, మహిళా ఉపాధ్యక్షులుగా అరుణకుమారి, కార్యదర్శులుగా కైలాస్,అన్వేష్, మహిళా కార్యదర్శులుగా సరిత, వందనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి జిల్లా శాఖ పక్షాన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.