గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట
* పిట్టబొంగారంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం * 'ఆరు సూత్రాల’ ప్రణాళికతో గిరిజన గ్రామాల రూపురేఖలు మారుస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి గిరిజన గ్రామం మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారతతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవాలన్నదే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల...