Chitram news
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 10:04 pm Editor : Chitram news

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

 నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టు: ఇద్దరు అరెస్ట్

చిత్రం న్యూస్, జైనథ్: అమాయక రైతులే లక్ష్యంగా సాగుతున్న నకిలీ ఎరువుల విక్రయాల ముఠా ఆట కట్టించారు. జైనథ్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో ఈ నకిలీ ఎరువుల రాకెట్ గుట్టురట్టయింది.

నల్గొండ జిల్లాకు చెందిన  ఏపురి కృష్ణయ్య, జైనథ్ మండలం కంట గ్రామానికి చెందిన బట్ట మహేందర్‌గా నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడులలో నిందితుల నుండి 60 నకిలీ ఎరువుల బస్తాలతో పాటు ఒక కారు, బైక్, మొబైల్ ఫోన్లు, నకిలీ బిల్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పంట దిగుబడిని, భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచించారు.