ఆదిలాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం: స్నిఫర్ డాగ్ ‘రోమా’తో ముమ్మర తనిఖీలు
ఆదిలాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం: స్నిఫర్ డాగ్ 'రోమా'తో ముమ్మర తనిఖీలు చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈగల్ టీమ్ ఆదివారం పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో మెరుపు తనిఖీలు చేపట్టింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ 'రోమా' కీలకంగా వ్యవహరించింది. కాకర్ స్పానియల్ జాతికి చెందిన రోమా...