బాసర నుంచి ఓనికి వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో…
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని నుంచి బాసర వెళ్లే రహదారికి తొలుత మోక్షం కలిగిందని గ్రామస్తులు సంబరపడ్డారు. అంతలోనే ఆ రోడ్డు పనులు నిలిచిపోయాయి. గత కొన్ని సంవత్సరాలనుండి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, బ్యాంకు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూరగాయల మార్కెట్ కు వెళ్లాలన్న 25 గ్రామాల ప్రజలకు ఈ దారే దిక్కు. వంతెన శితిలావస్థలో ఉండడంతో దానిపైనే సీసీ రోడ్డు పూర్తి చేశారు. ఓని నుంచి బాసర వెళ్లే రహదారి రూ.1.50 కోట్లతో మంజూరై నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వంతెన పై 200 మీటర్ల రోడ్డు వేసి ఆపేశారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ఇంకా రోడ్డు నిర్మాణం పూర్తి చేపట్టలేదని కష్టాలు తప్పడం లేదని స్థానికులు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కు ఆయా గ్రామాల సర్పంచులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాకులు చెబుతూ దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం విత్తనాలకు వెళ్లాలన్న, ఎరువుల కోసం వెళ్లాలన్న కష్టాలు తప్పవని ప్రజలు అనుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రహదారి కోసం నిధులు మంజూరు చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు ఆగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
