వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వెల్డింగ్ ఓనర్స్, వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం పట్టణంలోని తిర్పెల్లి డైమండ్ ఫంక్షన్ హాల్‌లో జమీల్ అధ్యక్షతన జరిగిన వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోసియేషన్ అభివృద్ధికి ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అసోసియేషన్ సభ్యులకు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
