ఆదిలాబాద్‌లో ఘనంగా ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు: టాపర్లకు కలెక్టర్ సత్కారం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం గత విద్యాసంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాల కేంద్రం పుస్తక నిధి పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్, ఏఎంఓలు లక్ష్మణ్, అజయ్, జిల్లాలోని పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
