Chitram news
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:21 pm Editor : Chitram news

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నెంబర్-1)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక అభ్యసన మెరుగుదల తరగతులను (Learning Improvement Classes) జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఈ ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, డీసీఈబీ సెక్రటరీ గజేందర్, ఏఏంఓలు లక్ష్మణ్, అజయ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.