జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం
జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులకు మంగళవారం పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాయల్ ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్గదర్శకత్వంలో...