యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘విద్యా వారోత్సవాల’ సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్, బడి బాట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా సమ్మర్ క్యాంపులో స్వయంగా తబలా, హార్మోనియం వాయించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినోద్ రెడ్డి, సర్పంచ్ నీరోష్, ఉప సర్పంచ్ దత్తు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మామిళ్ల పార్వతి, ఎంఈఓ రమేష్ రెడ్డి, ఏఏమో లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రఘు రమణ, సంతోష్, లింగు, ఇతర అధికారులు, విద్యార్థులు, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

