ఆదిలాబాద్ జిల్లాకు నీతి ఆయోగ్ నుంచి రూ.4.29 కోట్లు మంజూరు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నీతి ఆయోగ్ ‘విండో-II’ ఇన్నోవేషన్ కేటగిరీ కింద రెండు కీలక ప్రాజెక్టులకు రూ.4.29 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గిరిజన ప్రాంతాల ప్రగతి, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
మంజూరైన ప్రాజెక్టులు:
1. *లక్క సాగు అభివృద్ధి – రూ.0.40 కోట్లు:* నార్నూర్ బ్లాక్‌లోని 20 గ్రామాలకు చెందిన 370 గిరిజన కుటుంబాలకు లబ్ధి. అడవిపై ఆధారపడే గిరిజనులకు శాస్త్రీయ శిక్షణ ఇచ్చి అదనపు ఆదాయం కల్పించడం లక్ష్యం.
2. *వాడీ సాగు – 3 అంచెల సమీకృత వ్యవసాయం – రూ.3.89 కోట్లు:* నార్నూర్ ప్రాంతంలోని 286 మంది సన్నకారు రైతులకు లబ్ధి. ఉద్యాన పంటలు, కూరగాయలు, టేకు సాగులో ప్రోత్సాహం అందించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారు.
ఈ నిధులను సక్రమంగా వినియోగించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా ధీమా వ్యక్తం చేశారు.
