ఆదిలాబాద్‌లో భారీ జాబ్ మేళా
5000+ ఉద్యోగాలు, ఈ నెల 20న చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో!
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం మరో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న నిర్వహించిన జాబ్ మేళాకు అద్భుతమైన స్పందన లభించిందని, అదే స్ఫూర్తితో ఈ నెల 20వ తేదీన మావలలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాబ్ మేళాలో ఐటీ, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ వంటి వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 5000కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితిని సరళీకరించి, 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉన్న వారికి అవకాశం కల్పించారు. అర్హతలను బట్టి అభ్యర్థులకు ఏడాదికి ₹1.5 లక్షల నుండి ₹4 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది.ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటా లేదా సివి(CV) లను సిద్ధం చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, సందేహాల నివృత్తి కోసం 9666612707, 7981255978 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి, జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
