అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ గోడం నగేష్
అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ గోడం నగేష్ చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న, జొన్న పంటలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ పరామర్శించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎంపీ, జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల గోసను ఆలకించిన ఎంపీ, వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున త్వరితగతిన సహాయం అందేలా...