ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజం
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిపోయిన జొన్న, మక్క పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అన్నదాతలకు భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.....