అవల్పూర్ గ్రామంలో భూసార పరీక్ష గురించి అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్ గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక భాగంలో సోమవారం రైతులకు భూసార పరీక్ష (మట్టిపరీక్ష ) గురించి ఇఫ్కో ప్రతినిధి ఆదిలాబాద్ మార్కెటింగ్ నిఖిల్ గొర్లవార్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మట్టి నమూనా ఎలా తీయాలి.. ఫీల్డ్,డిమాన్స్ట్రేషన్ చేయడం ఎలా అనే దాని పై వివరించారు. భూసార పరీక్ష (మట్టి పరీక్ష) ద్వారా నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని తెలిపారు. మట్టి నమూనాలు తీసుకొని 15 రోజుల తర్వాత మా ఇఫ్కో కంపెనీ తరపున రైతులకు భూసార పరీక్ష రిపోర్ట్ ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దినేష్, మాజీ ఎంపీటీసీ నగేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, రమణ, రైతులు రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
