ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు
ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు చిత్రం న్యూస్, బేల: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతు వేదికలో నేల ఆరోగ్యం, పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్ష , వివిధ పంటలలో సరైన మోతాదులో ఎరువుల వాడకం వంటి అంశాలపై వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ కుమార్ సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల నుంచి మట్టి...