Chitram news
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 9:45 pm Editor : Chitram news

పీఎంజీ జ్యువెలరీలో దోపిడీ: నిందితుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డ్!

పీఎంజీ జ్యువెలరీలో దోపిడీ: నిందితుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డ్!

చిత్రం న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో గల పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి, సుమారు ఒక కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సిబ్బందిపై దుండగులు కాల్పులు జరపగా, నలుగురు గాయపడ్డారు.  ఈ కేసును సవాలుగా తీసుకున్న కరీంనగర్ పోలీసులు నిందితుల సీసీ టీవీ (CCTV) దృశ్యాలను విశ్లేషించి, ఐదుగురు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. ఈ నిందితుల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి లేదా వారు పట్టుబడటానికి సహకరించే సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివరాలు తెలిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.  8712670762,  8712670711, 8712670713 లేదా అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేయాలన్నారు.