Chitram news
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 7:45 pm Editor : Chitram news

సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు 

సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు 

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం బాజీరావు బాబా భక్తులు నిర్వహించే ఏడు రోజుల (సప్తాహ) ఆధ్యాత్మిక ఉత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాజీరావు బాబా పల్లకిని ఊరేగింపు నిర్వహించారు. బాబా శిష్యులు ప్రవచనాలు,  బోధనలు, జీవిత విశేషాలను వివరించారు. చిన్నారులను ఎడ్ల బండి పై  దేవతల వస్త్రధారణతో కూర్చోబెట్టారు. భక్తులు పల్లకికీ పూజలు నిర్వహించారు. అనంతరం కాలదహీ హండీ నిర్వహించారు. హరిపాట్ గావించారు. గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కోలాటమాడుతూ నృత్యాలు చేశారు.  మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాజీరావు బాబా శిష్యులు, గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.