సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్రం న్యూస్, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (GRP) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు చెక్స్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై ‘పల్లవి’ అనే పేరుతో టాటూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
