నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET) పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాలలో 6 కేంద్రాలను వారు స్వయంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, విద్యార్థుల అటెండెన్స్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రూ, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, పరీక్షల కో-ఆర్డినేటర్ అశోక్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
