ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు రంగం సిద్ధం
ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు రంగం సిద్ధం చిత్రం న్యూస్, ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు పండించిన జొన్న పంటకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, ఇచ్చోడ, బజార్హత్నూర్, బోథ్,...