ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు రంగం సిద్ధం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు పండించిన జొన్న పంటకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, హాస్నాపూర్, సిరికొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రైతులు తమ పంటను బాగా శుభ్రపరిచి తేమ శాతం 14% కంటే మించకుండా,ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కొనుగోళ్లు కేవలం వేలిముద్ర బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతాయన్నారు. రైతులు తమ పంట వివరాలను ముందుగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని అనంతరం కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అని తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి జొన్నలు రాకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బయటి వ్యక్తులు రైతుల ముసుగులో పంటను విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏవైనా సందేహాలుంటే 6300001597 నంబర్‌కు సంప్రదించవచ్చని జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు.
