ఉపాధి హామీ పనులు లేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కనిపించడం లేదని పనులు లేక నెల రోజులుగా పస్తులు ఉంటున్నామని బాసరలోని ఉప్పుకుంటా కాలనీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనిని పొందే హక్కు ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ వాజిద్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కూలీలు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సుమారు 30 మందికి పైగా ఉన్న ఉపాధి జాబ్ కార్డుదారులందరికి వంద రోజుల ఉపాధి హామీపని కల్పించాలని కోరుతున్నారు.
