పదో తరగతి ఫలితాల్లో జైనథ్ జడ్పీహెచ్ఎస్ ప్రభంజనం
పదో తరగతి ఫలితాల్లో జైనథ్ జడ్పీహెచ్ఎస్ ప్రభంజనం వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ప్రతిభ చిత్రం న్యూస్, జైనథ్: బుధవారం విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Z.P.H.S) విద్యార్థులు రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. పరీక్షలకు హాజరైన మొత్తం 90 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు వందశాతం ఫలితాలను అందించారు. మండల టాపర్గా సాయి స్మృతి: ఈ ఫలితాల్లో సాయి స్మృతి అనే...