Chitram news
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 8:01 pm Editor : Chitram news

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!

  • బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం

చిత్రం న్యూస్, హైదరాబాద్: మే 10వ తేదీన భాగ్యనగరంలో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు, ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ శాసనసభ, మండలి పక్ష నేతలు మహేష్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని సభ నిర్వహణపై చర్చించారు.