ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా “ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం (ZREAC) – 2026-27” సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు సూచనలు చేశారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, చీడపీడలపై అవగాహన కరదీపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, పరిశోధన సంచాలకులు డా.ఎం.బాల్ రాజ్, విస్తరణ సంచాలకులు డా.యాకాద్రి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.శ్రీధర్ చౌహాన్, వివిధ జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
