మూగజీవాల దాహార్తి కోసం నీటి తొట్టె ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
చిత్రం న్యూస్, మావల: భానుడు భగ భగమంటూ ప్రతాపం చూపిస్తున్నాడు. ఆ మండే ఎండలతో మూగజీవాలు సైతం నీటి కోసం వెంపర్లాడుతున్నాయి. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బట్టి సావర్గాం గ్రామ సర్పంచ్ నీటి తొట్టెను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ శివారులో పశువుల కోసం పంచాయతీ నిధులతో తొట్టెను నిర్మాణం చేయిస్తున్నాడు. ఉదయం పూట అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నాడు. తొందరగా నిర్మాణం పూర్తి చేయించి పశువులకు నీటి తొట్టెను అందుబాటులోకి తీసుకొస్తానని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
