జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
చిత్రం న్యూస్, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు పోర్టల్ ను (Self-Enumeration) ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయ గణన పోర్టల్ ను ఉపయోగించడం వల్ల విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం, మున్సిపాలిటీ TPO సోమయ్య, రాజు,బిక్షం, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు