బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కుటుంబీకులతో కలిసి ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. కలెక్టర్ వెంట ఆలయ ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, పండితులు తదితరులు ఉన్నారు.