ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రిమ్స్ డైరెక్టర్ డా.జై...