Chitram news
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 7:36 pm Editor : Chitram news

ఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీ

ఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీ

చిత్రం న్యూస్, బేల: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా అవాల్పూర్ సర్పంచ్ అనిల్ ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. శుక్రవారం పనుల ప్రదేశానికి స్వయంగా వెళ్లిన సర్పంచ్ అనిల్ అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కూలీలు అలసటకు గురికాకుండా ఉండటానికి వారికి స్వచ్ఛమైన తాగునీటిని, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల వద్ద నీడ సౌకర్యం కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ చేసిన ఈ పనిపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.