పొన్నారిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
పొన్నారిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా చిత్రం న్యూస్, తాంసి: తాంసి మండలం పొన్నారి గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పూడికతీత పనులను స్వయంగా పరిశీలించిన ఆయన కూలీల మస్టర్ రోల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా...