Chitram news
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 8:40 pm Editor : Chitram news

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

*సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అవసరమైన వారు ఈ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్, రాంరెడ్డి, నరేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.