Chitram news
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:53 pm Editor : Chitram news

భాద్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ను కలిసిన టీఎన్జీఓ నాయకులు

చిత్రం న్యూస్, కలెక్టరేట్: :ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్ రావులను వారి కార్యాలయాలలో ఆదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, టీఎన్జీవో కేంద్ర సభ్యులు తిరుమల్ రెడ్డి, జిల్లా సభ్యులు, చంద్ర మోహన్ రెడ్డి, యస్ రాజేశ్వర్, అదిప నారాయణ, రవి, అదిలాబాద్ రూరల్ తాలూకా అధ్యక్షులు అసురీ ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి కె.అరుణ్ కుమార్, సభ్యులు దుర్గయ్య, సోహైల్, శ్రీనివాస్, నవీన్ కుమార్, కలీo, అఖిల్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు