ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి
ఆదివాసీల కోసం 'టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్' ప్రారంభించిన మంత్రి జూపల్లి చిత్రం న్యూస్, ఉట్నూర్: ఆదివాసీ గూడాల ప్రజల్లో చైతన్యం నింపి, ఆధునిక సమాజంతో మమేకం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉట్నూర్ మండలం గోండు గూడలో బుధవారం రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ను జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా నాగోబగూడలో మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు...