Chitram news
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 9:36 pm Editor : Chitram news

జైనథ్ లో హిందూ సమ్మేళనానికి ఘనంగా ఆహ్వానం – బెల్లూరిలో ప్రచారం

జైనథ్ లో హిందూ సమ్మేళనానికి ఘనంగా ఆహ్వానం – బెల్లూరిలో ప్రచారం

చిత్రం న్యూస్, జైనథ్: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈనెల 24వ తేదీ శుక్రవారం రోజు జైనథ్‌లో నిర్వహించతలపెట్టిన భారీ “హిందూ సమ్మేళనం” విజయవంతం చేయాలని కోరుతూ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం బెల్లూరి గ్రామస్తులను కలిసి సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 24న జరిగే ఈ సమ్మేళనానికి హిందూ బాంధవులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గ్రామంలోని యువత, భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్వరూప్,అఖిల్, రవి,సూరజ్, సుజిత్, ధర్ము, ధనుష్, సాత్విక్, శ్రీశాంత్ పాల్గొన్నారు.