సర్కార్ బడిలో పిల్లల్ని చేర్పించాలి: సర్పంచ్ మధుప్రీతి
* కీర్గుల్ (కె ) గ్రామంలో బడిబాట కార్యక్రమం
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె ) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సర్పంచ్ మధు ప్రీతి, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ప్రిన్సిపల్ ప్రవళిక , భవాని, అంగన్వాడీ టీచర్ ఈశ్వర బాయి, ఉపాధ్యాయులు కీర్గుల్ (కె ) గ్రామంలో పర్యటిస్తూ తల్లిదండ్రులను కలుసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు. అలాగే పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, మెరుగైన బోధన విధానాల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు. వార్డ్ మెంబర్స్. గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.