Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 10:17 pm Editor : Chitram news

రేకులపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ..హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు

రేకులపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ..హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు

* ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని స్థానిక సర్పంచ్ రాజేందర్, గ్రామాభివృద్ధి చైర్మన్ నారాయణ పలువురు గ్రామస్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలిపారు. అనంతరం గ్రామంలోని పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.