Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:57 pm Editor : Chitram news

ఉత్సాహభరితంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

ఉత్సాహభరితంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

* నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ టోర్నమెంట్ లో రెండవ రోజైన మంగళవారం మొత్తం నాలుగు మ్యాచ్ లు విజయవంతంగా కొనసాగాయి.ప్రతి మ్యాచ్ లోనూ ఆటగాళ్లు తమ పత్రిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, టోర్నమెంట్ మరింత రసవత్తరంగా సాగుతుండగా, తదుపరి మ్యాచ్ లపై ఆసక్తి మరింత పెరుగుతోందని తెలిపారు. మొదటి మ్యాచ్ గజానన్ టీం, గుండారం లెవన్ మధ్య జరగగా గజానన్ టీం గెలుపొందింది. రెండవ మ్యాచ్ వేల్పూరు పీఎస్, ముప్కాల్ లెవన్ మద్య జరుగగా వేల్పూరు పీఎస్ విజేతగా నిలిచింది. మూడవ మ్యాచ్ చత్రపతి శివాజీ, అమాపర్ టీం మద్య జరుగగా చత్రపతి టీం గెలుపొందింది. నాల్గవ మ్యాచ్ మోహన్ లెవన్, వర్ని వారియర్స్ మద్య జరుగగా వర్ని వారియర్స్ వాక్ ఓవర్ చేయడంతో మోహన్ లెవన్ ని విన్నర్ గా పక్రటించారు.