వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి పరిశీలన
వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి పరిశీలన చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో రహదారులు, నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా తీసుకోవాల్సిన నివారణ, రక్షణ చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరద నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ...