Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:25 pm Editor : Chitram news

కలెక్టర్ రాజర్షి షా ను కలిసిన నూతన ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు

కలెక్టర్ రాజర్షి షా ను కలిసిన నూతన ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా బాధ్యతలు స్వీకరించిన పి.జగదీశ్వర్ రావు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కలెక్టర్‌కు ఆయన పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆర్డీఓకు దిశానిర్దేశం చేశారు.