Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:03 pm Editor : Chitram news

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ఇంటర్మీడియట్ చదువుతూ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులుకైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో తమకు ఎలాంటి బ్రాంచీలు లేకున్న తొలిప్రయత్నంలోనే ఇంటర్ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ సి హెచ్. విజయలక్ష్మి తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎస్ హేమ 132, రాఖీ 1763, రమాదేవి 2800,సంధ్య 2984, ఎస్.ఆర్థిక 4761, హెచ్. భరత్ 6430, శరత్ చంద్ర 8388, అమృత వర్షిణి 9461, ఎ.అత్రీజ్9955, జే. తన్విక 10292 ర్యాంకులు సాధించగా కాకతీయ ఐఐటీ /మెడికల్అకాడమీ డైరెక్టర్  సీ హెచ్. రామోజీరావు (ఐఐటియన్) వారినిసన్మానించారు.

ఈ సంధర్బంగా రామోజీరావు మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థకు వేరే జిల్లాలో, ఇతర బ్రాంచీలలో సాధించిన ఆలీండియా ర్యాంక్స్ కాదని కేవలం నిజామాబాద్ కాకతీయలో సాధించిన ర్యాంకులు అని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 10 మంది విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా స్థాయి ర్యాంకులు సాధిస్తే 50 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారన్నారు. తమ విద్యార్ధులు జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి కాకతీయ విద్యాసంస్థల పేరు నిలబెట్టారని అన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ తేజస్విని, సీ హెచ్ రాజా, ఐఐటీ అకాడమీ డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ సందిప్ కులకర్ణి, రణదిష్, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం, జ్యోత్స్న తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.