నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి
*అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ప్రమోషన్ పొందిన వారిని పోలీసు కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన చాంబర్లో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశానుసారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా నలుగురు ప్రమోషన్ పొందారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో వర్ని పోలీస్ స్టేషన్ కు చెందిన సికె.ఆనంద్, జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వి. సతీష్, ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కె.నవీన్ కుమార్, నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన శశి ప్రసాద్ లు ఉన్నారు.