వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’
వృద్ధుడికి అండగా 'సనాతన హిందూ సేవా సమితి' చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా పెట్టుకున్న 'సనాతన హిందూ సేవా సమితి' తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో 177వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖిలా వరంగల్ మధ్య కోట ప్రాంతానికి చెందిన చింత కొమురయ్య గౌడ్ అనే వృద్ధుడు వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అతనికి ఎటువంటి ఆధారం...