ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం:‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకావిష్కరణ
ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం:‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకావిష్కరణ చిత్రం న్యూస్, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మృతివనంలో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై అమరులకు ఘన నివాళులర్పించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిలు...