Chitram news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 8:24 pm Editor : Chitram news

అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్

 అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్

*  కార్యక్రమ నిర్వాహకులకు రూ.10 వేలు అందజేత 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ అసోసియేషన్ & ఫాలోవర్స్ ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలని ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి దుర్గంశేఖర్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడప్రతులను  సోమవారం  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు బాబా సాహెబ్ జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నాటికకి భారీ సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం విజవంతం కోసం తన వంతుగా రూ.10 వేలు నగదును కార్యక్రమం నిర్వహకులు, ఉట్నూర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ బొంకంటి  తదితరులకు అందజేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు అంబేద్కర్ అసోసియేషన్ ఉట్నూర్, CH.రమేష్, శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, అంజన్న, మతిన్, స్వామి, కిషన్, రఘనాథ్ ఆడే తదితరులు పాల్గొన్నారు.