ఆదిలాబాద్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా ను ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు, అత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులను కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.